14 Dec 2007

తెలుగు సామెతలు Part 1

ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు

ఆదిలోనే హంస పాదు

ఏమీ లేని ఎడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదు

ఆలస్యం అమృతం విషం

అళూ లేదు చూలూ లేదు కొడుకు పేరు కోటి లింగం

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

ఆరోగ్యమే మహాభాగ్యం

అబద్దం ఆడినా అతికినట్టు ఉండాలి

ఆడగందె అమ్మ అయినా అన్నం పెట్టదు

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

అగడ్తలో పడ్డ పిల్లి కి అదే వైకుంటాము

అగ్నికి వాయువు తోడైనట్టు

ఐశ్వర్యం వస్తే అర్థరాత్రి గొడుకు పట్టమనే వాడు

అందితే సిగ లేకపోతే కాళ్ళు

అప్పు చేసి పప్పు కూడుఅయ్య వచ్చేవరకు అమావాస్య ఆగుతుందా
బతికుంటే బాలూసాకు తినవచ్చు

బూడిదలో పోసిన పన్నీరుచాదస్తపు మొగుడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు

చాప కింద నీరులా

చదువు రాని వాడు వింత పశువు

చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు

చక్కనమ్మ చిక్కినా అందమేచెడపకురా చెడేవు

చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు

చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టు

చింత చచ్చినా పులుపు చావలేదు

చిలికి చిలికి గాలివానా అయినట్టు

దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నట్టు

దరిద్రుడి పెళ్ళికి వడగల్ల వాన

దయ్యాలు వేదాలు పలికినట్టు

దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

దూరపు కొండలు నునుపు

దున్నపోతు మీద కురిసిన వాన

దురాశ ధుఖానికి చేటు

ఎవరికి వారే యమునా తీరే

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్టు

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె ఆనందానికి గాడిద మూర్చపోయిందంటా

గంతకు తగ్గ బొంత

గోరు చుట్టూ రోకలి పోటు

గొంతెమ్మా కోరికలు

గుమ్మడి కాయల దొంగ అంటే బూజాలు తడుముకున్నట్టు

ఇంట గెలిచి రచ్చ గెలువు

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం

జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే

కాకి ముక్కుకీ దొండపండు

కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తది

కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోగలమా

కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా

కరవమంటే కప్పకీ కోపం విడవ మంటే పాము కి కోపం

కీడెంచి మెలెంచామన్నారు

కొండనాళికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్టు

13 Dec 2007



ఇక్కడ మీకు కనిపిస్తున్న ఛాయా చిత్రాన్ని చూడండి.... ఈ స్థలం అంటే నాకు చాలా భయం ఇక్కడకి రమ్మని నా స్నేహితులు పిలిస్తే... స్మశానానికైనా వస్తాను గానీ అక్కడికి రాను అని తెగేసి చెప్పాను. ఎందుకంటే ఈ స్థలం లోనే నా పరువు మంటగలిసిపోయింది.. అన్యాయంగా నా డిజిటల్ కేమరా నీటిలో పడిపోయింది. ఇంకా నయం నేను పడలేదు నీటిలో.!! నీట్లో పడలేదు అని సంతోషించాను అనుకుంటున్నారా? అలా అయితే నా పరవు ఇంకా అంతే మీకు నిజం తెలిసిన తర్వాత మీరు ఏమంటారో తెలియదు కానీ మీరు మాత్రం నవ్వోద్దు. నీటిలో అయితే పడలేదు కానీ ఒక అందమైన అమ్మాయి కాళ్ళ మీద పడ్డాను అదేలాగో చెపుతా.. అదిగో అక్కడ రెండు పెద్ద భవనాలు ఉన్నాయి రెండు చివరలలో.. వాటికి మధ్యలో రెండు చిన్న భవనాలు ఉన్నాయి. వాటి దగ్గర నిశితంగా గమనిస్తే మీకు తెల్లగా నీళ్ళు పోస్తున్నట్టు నీళ్ళధార కనిపిస్తుంది. అక్కడికి దేశవిదేశాల నుండి సందర్శకులు వస్తారు.
అక్కడికి నేను నా తొట్టి గ్యాంగ్ ని వెనకేసుకొని వెళ్ళాను.. ఎంతైనా నాకు కొంచెం హుషారు ఎక్కువ దాని వల్ల అందరు నా మెడలో కేమరా తగిలించి ఫోటోలు తీయమన్నారు. నేను ఫోటోలు బాగా తీస్తానని నాకు పేరుంధి లెండి.
అలా తీస్తున్నప్పుడు నా లాగే ఒక అమ్మాయి వాళ్ళ తొట్టి గ్యాంగ్ తో వచ్చింది అనుకుంటా.... ఆమెకూడ ఫోటో తీస్తుంది అదే సమయం లో నేను కూడా ఇద్దరం ఒకే దగ్గర నిలబడ్డాము. ఇక్కడ స్థలం చినదిగా ఉంటుంది. కాస్త చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఎవరో ఒకరు కాళ్ళు తగిలో లేక ఆ గుంపులో నడవటము రాక కింద పడుతుంటారు.

నేను ఆ అమ్మాయి ని చూడకుండా ఢీ కొట్టాను అంటే వెనకకి నడుచుకుంటూ వెళ్ళి ఆమె కాళ్ళ మధ్యలో ఒక కాలు వేశాను. అంతే ఆమె వెంటనే తన కాలుని వెనక్కి లాక్కొవటంతో నేను పట్టుతప్పి వెనక్కి అలానే ఆమె కాళ్ళమీద పడ్డాను. సాధారణంగా కింద పడెటప్పుడు చేతులు పైకి లేపి బాలన్సు చూసుకున్టాము కదా నేను అలానే చేతులు లేపాను అంతే వెనకనుండి కెమెరా నీళ్ళలో పడింది. నా అదృష్టం బాగుండి ఆది నా సొంత కేమరా. అందుకే వెధవలు అందరూ నవ్వుతూ చూస్తున్నారే తప్ప ఒక్కడు వచ్చి సాయం చేయలేక పోయాడు. నేను వెంటనే లేచి ఆ అమ్మాయికి సారీ చెప్పాను. నా కు టైం బాగాలేక అంతకు కొంచెం సేపు ముందు వర్షం పడటమ్ తో ఆ నెలంతా చిత్తడిగా ఉంది ఇకా నా బట్టల సంగతి నేను చెప్పను ఎందుకంటే ఈ పాటికే మీకు అర్థం అయ్యుంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆస్ట్రేలియా నుండి వచ్చింది సింగపూర్ ని సందర్శించడానికి. ఆది అప్పటి నుండి నేను ఇదిగో ఇప్పుడు పక్కన ఉంది చూడండి ఛాయా చిత్రం ఇలా దూరం నుండి తీస్తా ఫోటోలు.

నా గురించి చెప్పనా? అయితే చదవండి!

నా పేరు చిన్నా. నేను చేసేపనులన్ని ఎలా ఉంటాయి అంటే గోటితో పోయేదానిని గొడ్డలి దాకా తేవడం అంటారు ఆది నాకు సరిగ్గా వర్తిస్తుంది.
నేను నా బ్లాగ్ కి పేరు సింగపూర్ చిన్నోడు అని ఎందుకు పెట్టానంటే.....దానికి కూడా ఒక చిన్న కథ ఉంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాదినో..... కానీ ఏంచేద్దాం ఇప్పుడు నా టైం బాగాలేదు. సరే నేను ఇక్కడ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాలుగు రాళ్లు సంపాదిస్తున్నాను. ఎందుకంటే నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి... అవన్ని తీరాలి కదా??? Hmmmmmmmmmmm
సరే నేను అడగదలచుకున్నది ఏంటంటే.......... మీరు ఇది చదివిన తర్వాత నా టైప్ లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. ధన్యవాదములు నేను ఇక ముందు చక్కని హాస్య కథలు, అనుభవాలు రాస్తాను. మీ అందరికి ధన్యవాదములు.

Singapore chinnodu

This is Chinna from singapore